సి.వి. అనే పేరుతో ప్రసిద్ధి చెందిన చిత్తజల్లు వరహాలరావు తెలుగు హేతువాది 14.1.1930 /జనవరి 14 1930న గుంటూరు లో జన్మించారు. నాస్తికయుగం మాసపత్రిక సంపాదకవర్గఇటీవలి మార్పులు సభ్యులుగా పనిచేశారు. ఈ నాస్తిక నాయకుడు మరణ పర్యంతం విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నారు.'చిత్తజల్లు వరహాలరావు' ఒక సాంఘీక విప్లవకారుడే కాదు. సాంస్కృతిక రథసారధి. నిజాలను నిగ్గు తేల్చిన నిత్య పరిశోధకుడు. శ్రీశ్రీ కవిత్వం యువతరం గుండెలను ఎలా ఉర్రూతలూగించిందో 'సివి' రచనలు విద్యార్థి, యువజనుల లోకపు మస్తిష్కాలకు పట్టిన ఛాందస భావాల దుమ్ము దులిపింది. వారిని అభ్యుదయం వైపు నడిపించింది. శాస్త్రీయ విజ్ఞానం ప్రజల్లో పెంపొందించడానికి ఆయన చేసిన కృషి అనితర సాధ్యం అంటే అందులో అతిశయోక్తి లేదు.మహాకవి శ్రీశ్రీకి ఏకలవ్య శిష్యుడు.ప్రగతిశీల సాంస్కృతిక జ్వాల.దిగంబర కవులకు మార్గదర్శి.సామాజిక విముక్తి జరగనిదే రాజకీయ విముక్తి అసాధ్యం అని చాటిచెప్పిన వైతాళికుడు.ఆధిపత్యాన్ని ప్రశ్నించి తెలుగు కవిత్వాన్ని శూద్రీకరించిన సాంఘిక విప్లవ కవి. 8.11.2017 న మరణించారు.
చిత్తజల్లు వరహాలరావు ఎక్కడ జన్మించాడు?
Ground Truth Answers: గుంటూరుగుంటూరుగుంటూరు
Prediction: